రేఖ ఫౌండేషన్ సహకారంతో వాటర్ ప్లాంట్ మంజూరు పట్ల హర్షం
తుంగతుర్తి (విజయ క్రాంతి): డాక్టర్ రేఖ ఫౌండేషన్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయినపల్లి రేఖ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామ అభివృద్ధి, ముఖ్యంగా తాగునీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.
సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన రేఖ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ మంచి మనసుతో రూ.2.50 లక్షల బడ్జెట్‌తో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. చెప్పిన మాట ప్రకారం వారం రోజుల్లో, ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని మేడమ్ తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాన్ని గుర్తించి వెంటనే, స్పందించిన రేఖ మేడమ్‌కు సర్పంచ్ స్వాతి భాస్కర్ , గ్రామ గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






