16 May, 2026 | 8:02 PM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే

16-05-2026 07:04 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలో పెంబి, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాల్లో వివిధ అభివృద్ధి పనులను అదిలాబాద్ ఎంపీ నాగేష్ ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజు పటేల్ శనివారం ప్రారంభించారు. ప్రారంభించే పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నాణ్యతతో పనులు పూర్తి చెయ్యాలని కోరారు . గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు.

నాణ్యతతో త్వరతిగతిన పనులు పూర్తి చేయాలన్నారు. దస్తూరాబాద్ లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే గారిని సన్మానించి అదనపు గదులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలం అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గారు,అధికారులు స్థానిక సర్పంచ్,వార్డ్ సభ్యులు,మున్సిపల్ కౌన్సిలర్ లు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.