విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి
మండల విద్యాధికారి బాలునాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళావేదికను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలని మండల విద్యాధికారి బి బాలునాయక్ కోరారు. శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ పాఠశాలలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన కళావేదికను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ప్రతినిధులు రత్నం లక్ష్మాజీ, మారం లింగారెడ్డి, సార్ల వెంకన్న, గంగ నాగార్జున రెడ్డి, సూర్యాపేట జిల్లా మాజీ జెడ్పిటీసీ జీడి భిక్షం,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పాఠశాల చైర్మన్లు బొడ్డు స్వప్నరమేష్, కర్కాని శైలజజానయ్య, మాజీ సర్పంచులు జీడి వీరస్వామి, కందుల చిన్న తిరుమలరావు, పూర్వ విద్యార్థులు బొడ్డు శంకర్,బుడిగె మల్లేష్ యాదవ్,చెర్కుపల్లి లక్ష్మణ్,కొనతం కర్ణాకర్ రెడ్డి,గోలి కోటిరెడ్డి,శ్రీరంగం వెంకన్న,బొడ్డు వెంకటనర్సు,మారం వెంకట్ రెడ్డి,కొనతం వెంకట్ రెడ్డి,హెచ్ఎంలు కే నర్సయ్య,రాములు,పీడీ దాసయ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






