14 August, 2026 | 11:01 PM

ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు

14-08-2026 09:51 PM

పొంగులేటిని విమర్శించే స్థాయి నీదా?

కల్లూరు,(విజయక్రాంతి): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కమలాపూర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం లక్కినేని కృష్ణ నివాసంలో మండల అధ్యక్షుడు పోట్రు అర్జున్‌రావు, పట్టణ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా కార్యక్రమంలో మంత్రి పొంగులేటిపై అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు.

పెద్దలను గౌరవించడం కనీస బాధ్యత అని, కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూపించి మాట్లాడాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తు పొందిన వ్యక్తి అదే పార్టీని విమర్శించడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని విమర్శించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని చూసి ఓర్వలేకే కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు.సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్,ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోట్రు అర్జున్ రావు,లక్కినేని కృష్ణ,శీలం కృష్ణారెడ్డి,యాస శ్రీకాంత్, ఆళ్లకుంట నరసింహారావు,ఉబ్బన రాంబాబు,నల్లగట్ల పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.