14 August, 2026 | 10:06 PM

Breaking News

చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •  

మేడిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కళావైభవ కార్యక్రమం

16-05-2026 07:13 PM

జిల్లా విద్యాధికారిణి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు

మేడిపల్లి,(విజయక్రాంతి): పీఎం శ్రీ జెడ్‌పిహెచ్‌ఎస్ మెడిపల్లి పాఠశాలలో ప్రజాపాలన- ప్రగతి పాలన. విద్యావారొత్సవాలు లో భాగంగా జిల్లా స్థాయి కళావైభవం కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమిష్టిగా  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శనివారం జిల్లాలోని అన్ని పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్రలేఖనం, నృత్యం, ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి మరియు కళారూపాలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారిణి  ఐ. విజయ కుమారి పాల్గొని విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో  ఏ ఎం ఓ వేణు, వివధ మండలాల ఎంఈఓ లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.