విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి
14-08-2026 10:02 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రభుత్వం అన్ని ప్రయోజనాలు త్వరగా అందించాలని ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో విద్యుత్ ఉచ్చుకు బలై ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుమార్ మృతికి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బుర్కా సత్యం, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరుణ, సెక్షన్ ఆఫీసర్ లు శీను, బాలాజీ, దేవ సింగ్, నరసయ్య, స్వామి, ఎఫ్ బి ఓలు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.






