1 June, 2026 | 7:51 PM

నిర్మల్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్

01-06-2026 07:04 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్ర నిర్మాణం షూటింగ నిర్వహిస్తున్నారు. గమా ఎంటర్టైన్మెంట్ శిరీష ప్రజెంట్ ప్రొడ్యూసర్ గోలి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మల్ జిల్లా పరిసర ప్రాంతాలలో వడ్యాల నిర్మల్ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుందని డైరెక్టర్ గోలి రామకృష్ణ తెలియజేశారు. ఈ చిత్రంలో నిర్మల్ లో ఉన్న కళాకారులను ఆడిషన్ ద్వారా ఎన్నిక చేసుకున్నామని వారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేలా నిర్మల్ కళాకారులకు అవకాశం  కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ రవికుమార్ కెమెరామెన్ అశోక్ కనకాల కో- ప్రొడ్యూసర్ గోలి బాలకృష్ణ సంతోష్ కృష్ణన్ శిరీష కుమారి భాగ్యరెడ్డి బాలకృష్ణ స్వాతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు స్టంట్ మాస్టర్ సతీష్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్మల్ సోఫీ నగర్ గ్యారేజ్ లో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. లోకల్ ఆర్టిస్టులు కొప్పులచిన్నయ్య, డి ఎల్ ఎన్ చారి, జన్ను అనిల్ గుండారాజ్, తదితరులు పాల్గొన్నారు