17 June, 2026 | 3:30 AM

వాహనదారులు హెల్మెట్ ధరించాలి

17-06-2026 01:52 AM

సీసీ కెమెరాలతోనే భద్రత

కేసముద్రం, జూన్ 16 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని, సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డ్ లో సోమవారం రాత్రి  కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూఢనమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, డయల్ 100 సేవల వినియోగం వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు.

సైబర్ నేరాలు, గంజాయి వినియోగం, ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాలు, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు..ఈ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపాలిటీ 16 వార్డ్ కౌన్సిలర్ వల్లందాస్ ఉమ రవి, కళాజాత బృంద ఇఛార్జ్  వడ్లకొండ సతీష్, సభ్యులు మాదాసి తిరుపతి, మచ్చ పృధ్విరాజ్, మంద ప్రవీణ్, చైతన్య నగర్ కాలనీ వాసులు  కొమ్ము వెంకన్న, పందుల సoజీవ, నాగయ్య, అజేయ్ వల్లoదాసు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.