నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం
17-06-2026 01:51 AM
సుల్తానాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్నిచాటుకున్నారు. బాల్యమిత్రుల ట్రస్ట్1978-81 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పూసాలకు చెందిన నిరుపేద యువతి గంగోత్రి వివాహం ఈనెల 20న జరుగుతుండడంతో గంగోత్రి తండ్రి గతంలో మృతి చెందాడని, యువతి వివాహం ఉండడంతో బాల్యమిత్రులు 50 వేల రూపాయలను మంగళవారం పెళ్లికూతురు తల్లి మెరుగు రజితకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు ఉప్పు తిరుపతి, అధ్యక్షులు కోట లక్ష్మారెడ్డి, ఉట్కూరి రామ్మూర్తి, కొమురవెల్లి సుధాకర్, పిట్టల తిరుపతి, బాలకిషన్ ప్రసాద్, వీర లక్ష్మణ్, రమేష్, పురం విజయకుమార్, గజ భీమ్ కార్ రవి, లతోపాటు పలువురు పాల్గొన్నారు.






