హైదరాబాద్ హీరోస్ కెప్టెన్‌గా మొరెనో
- 16 నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్
- గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్‌లు
హైదరాబాద్, జూన్ 11 : రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 16 నుంచి గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ రగ్బీ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్ హీరోస్ జట్టు సిద్ధమైం ది. స్పెయిన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ మా న్యుల్ మొరెనో హైదరాబాద్ జట్టుకు కెప్టెవ్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ ప్రకటనతో పా టు ఈ సీజన్‌లో హైదరాబాద్ హీరోస్ ఆటగాళ్లు ధరించే జెర్సీని రగ్బీ హీరోస్ ప్రెసిడెం ట్ రాహుల్ బోస్, కేఎల్‌వో స్పోర్ట్స్ కో ఫౌండర్ శ్రీనాథ్ చిట్టూరి, తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల ఆవిష్కరించారు.
గత సీజన్‌లో మంచి ప్రదర్శనే కనబరిచినా అనుకు న్న లక్ష్యాన్ని అందుకోలేకపోయామనీ ఈ సారి సమిష్టిగా రాణించి టైటిల్ గెలుస్తామనీ కెప్టెన్ మొరెనో చెప్పారు. కాగా హైదరాబాద్ హీరోస్ జట్టుకు కోచ్‌గా దిగ్గజ రగ్బీ ప్లేయర్ డీజే ఫోర్బ్స్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత జట్టుకు నాయకత్వం వహించిన సుమిత్ ఈ సీజన్‌లో హైదరాబాద్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా సుమిత్ నిలిచాడు.
ఈ నెల 16న జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్‌తో తలపడుతుంది. గత సీజన్‌లో హైద రాబాద్ టీమ్ కాంస్య పతకం గెలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్, సీఎంవో సుజయ్ గంగూలీ, హైదరా బాద్ హీరోస్ ప్లేయర్స్‌తో పాటు ఆర్‌పీఎల్ నిర్వాహకులు పాల్గొన్నారు.






