22 March, 2026 | 2:23 AM

ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

22-03-2026 12:52 AM

పెజెష్కియాన్‌కు రంజాన్, నౌరుజ్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని మోదీ సూచనలు

న్యూఢిల్లీ, మార్చి 21: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రంజాన్, నౌరు జ్ (పర్షియన్ నూతన సంవత్సరం) శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాం తీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాల పై దాడులను ప్రధాని మోదీ ఖండించారు.

నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని.. నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటి ని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటం ఇది రెండోసారి. మార్చి 12న ఓసారి ఫోన్ లో సంభాషించిన ప్రధాని.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.