21 April, 2026 | 6:09 PM

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్

21-04-2026 04:45 PM

కారేపల్లి,(విజయక్రాంతి): భాగ్యనగర్ తండా గ్రామపంచాయతిలో వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ తెలిపారు. గ్రామంలోని 5వ వార్డులో ఏర్పాటు చేసిన మంచినీటి బోర్‌కు మోటార్ అమర్చించి, తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరాలాల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పక్షులు, ఇతర జీవుల కోసం కూడా నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని కోరారు.