21 August, 2026 | 8:26 PM

గల్ఫ్ బాధితునికి ఎమ్మెల్యే అండ

21-08-2026 06:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): సొన్ మండల కేంద్రానికి చెందిన దండుగుల గంగయ్య బ్రతుకు తెరువు కోసం ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్ళాడు. గత రెండు రోజుల క్రితం దుబాయ్ లో అనారోగ్య కారణంగా నర్సింలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మండల బీజేపీ నాయకులు సమాచారాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో హుటాహుటిన స్పందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో, NRI సెల్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మృత దేహాన్ని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.