21 August, 2026 | 8:23 PM

కోదాడ మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌గా కందుల కోటేశ్వరరావు

21-08-2026 07:33 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌గా కందుల కోటేశ్వరరావును ఎంపిక చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై విశ్వాసం ఉంచి తనకు ఈ కీలక బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని, వార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కౌన్సిల్‌లో పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేసి.. మున్సిపల్‌ పాలనలో ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.