జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పిటిషన్ ఉపసంహరించాలి
హుజూరాబాద్,(విజయక్రాంతి): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు జర్నలిస్టుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత ప్రభుత్వం అర్హులైన 52 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని, గూడూరు స్వామిరెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. “కలం పోరుబాట పడితే పాలకుల పీఠాలు కదలడం ఖాయం” అని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.






