21 August, 2026 | 7:45 PM

ఎస్సారెస్పీలో 44.26 టీఎంసీల నీటి నిల్వ

21-08-2026 06:42 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు లేనందున ప్రాజెక్టులోకి వరద నీరు నిలిచిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80.5 టిఎంసిలగాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1079.70 అడుగులకు 44.26 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు నుంచి 1013 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, ఎవాబిరేషన్ 482 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231  క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.