21 August, 2026 | 8:22 PM

ఆర్డీవో అజయ్ యాదవ్‌ను సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం

21-08-2026 07:18 PM

మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్

సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై ప్రస్తావన

సత్తుపల్లి,(విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఐఏఎస్ అజయ్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ఐఏఎస్ అజయ్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని అందజేశారు.

సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలనను మరింత పారదర్శకంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పు హనుమంతు, కల్లూరు టౌన్ అధ్యక్షులు బయ్యారపు నరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెలి శ్రీనివాసరావు, యువజన సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కోమటి తిరుమలరావు, పెనుబల్లి మండల అధ్యక్షులు కర్రి కమలాకర్, కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, బాలకృష్ణ, బొడ్డు కృష్ణ, ఎస్‌కే బాజీ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.