తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా మద్దిశెట్టి సామేలు
21-08-2026 07:27 PM
సత్తుపల్లి,(విజయ క్రాంతి): ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన మద్దిశెట్టి సామేలును సత్తుపల్లి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్‌చార్జులు, రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు తనపై నమ్మకం ఉంచి అదనపు బాధ్యతలు అప్పగించిన ఎన్సీపీ, ఎన్డీఏ, ఎన్ఓసీ జాతీయ అధ్యక్షులు ధీరజ్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, పొనక రామదాసు, దనసరి సారమ్మ, పుట్టబంతి హరిబాబు, ఈదుల రవి, ఊకే ఎంకన్న, కారం చంద్రయ్య, పలగాని శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.






