మారథాన్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, మే18 (విజయక్రాంతి): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక(Praja Palana-Pragathi Pranalika) కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన మారథాన్ ర్యాలీలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడం జరుగుతుందన్నారు.
యువత ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం, మారథాన్‌లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ మారథాన్ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






