19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

7వ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా..

07-02-2026 03:28 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ లోని 07వ వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 07వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశపాక లత – రాజేశ్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 07వ వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు. వార్డు అభివృద్ధి బాధ్యత తనదే అని భరోసా ఇచ్చిన ఆయన, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదే అని ప్రజలకు ధైర్యం చెప్పారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్యాల పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయంను గుర్తు చేశారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బోడ స్వామి, మారగోని ఆంజనేయులు గౌడ్, వనమా వెంకటేశ్వర్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.