19 May, 2026 | 11:32 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

నాబార్డ్ రుణాలపై రైతులకు అవగాహన

07-02-2026 03:22 PM

ఊర్కొండ: సహకార రంగం ద్వారానే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని నాబార్డ్ మహబూబ్‌నగర్ క్లస్టర్ కార్యాలయ ప్రతినిధులు అన్నారు. ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025’ సందర్భంగా శనివారం ఊర్కొండ రైతు వేదికలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులే యజమానులుగా ఉండే సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలని వారు పిలుపునిచ్చారు. నాబార్డ్ ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, పథకాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, శ్యామ్‌తో పాటు పలువురు రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.