07-02-2026 04:17:28 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని మైనారిటీస్ విద్యార్థినీ, విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎంఎ అబ్దుల్ నదీమ్ ఖుద్దుసి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ (ఫ్రెష్ & రెన్యువల్) స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 31, 2026 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన మైనారిటీస్ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే కళాశాల యాజమాన్యాలు EPASS నమోదుపై ప్రత్యేక చొరవ చూపి, దరఖాస్తుల ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.