14 July, 2026 | 6:20 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

రైతులకు సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలి

19-04-2026 02:54 PM

 ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంను ఎమ్మెల్యే నిర్వహించారు.

ఈ సమావేశంలో బ్రహ్మణవెల్లంల ప్రాజెక్ట్, అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరియు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పురోగతిపై సమగ్రంగా వివరాలు తెలుసుకుని, తగు సూచనలను ఆయన అందజేశారు. పనుల పురోగతి నిర్ణీత కాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర ఇరిగెషన్ పనులను వేగవంతంగా, తగు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.