జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం
14-07-2026 05:54 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ఈనెల 16న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు హాజరుకావాలని జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు కన్న కృష్ణ, డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






