14 July, 2026 | 7:00 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు.. డీలిమిటేషన్ కు వ్యతిరేకం

19-04-2026 02:51 PM

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రానున్న తమిళనాడు, బెంగాల్, ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్లీ బిల్లు తెచ్చారని ఆయన ఆరోపించారు. 2023లో బిల్లు ఆమోదం పొందినా 2024లో రిజర్వేషన్లు అమలు చేయలేదని, 33 శాతం రిజర్వేషన్లు ఇప్పడు అమలు చేసినా మాకు ఓకే అని ఎంపీ చామల కిరణ్ వెల్లడించారు. ఇండీ కూటమిపై భారతీయ జనత పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు.. డీలిమిటేషన్ కు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దేశ, రాష్ట్ర మహిళలు పట్టించుకోవద్దు అని ఎంపీ కోరారు.