14 July, 2026 | 6:17 PM

త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ

14-07-2026 05:42 PM

* ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాలి 

* పరిశుభ్రతను ప్రమాణాలను పాటించాలి

* నిర్వాహకులకు నోటీసులు అందజేత

* మండల పంచాయతీ అధికారి అబ్దుల్ వాజీద్

ముస్తాబాద్,(విజయక్రాంతి): ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగునీటి శుద్ది కేంద్రాలను మండల పంచాయతీ అధికారి అబ్దుల్ వాజీద్ ఏఈ సతీష్ మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటర్ ప్లాంట్ లో పనితీరు, నీటి శుద్ధి ప్రక్రియ, పరిశుభ్రత, ఫిల్టర్ల నిర్వహణ, నీటి నాణ్యత, సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు.

ప్లాంట్ యంత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ప్లాంట్ నిర్వాహకులకు నోటీసుల ద్వారా సూచించారు. వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది.దీని వల్ల అనేక రకమైన వ్యాధులు వస్తాయి, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు,విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించి స్వచ్ఛమైన నీరు అందించాలని కోరుతూ ఆరోగ్యంగా కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు