చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణ పనులు ఎన్ని అడుగుల వెడల్పుతో చేపట్టనున్నారనే విషయంపై ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని నివృత్తి చేయాలని కోరుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. రహదారి విస్తరణకు సంబంధించి అధికారిక వివరాలను త్వరగా ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. దీనివల్ల ప్రజల్లో ఉన్న సందిగ్ధత తొలగి, భవిష్యత్ చర్యలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. షబానా అజీముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కందాటి రమేష్ రెడ్డి, రుద్రారపు కృష్ణ, ఆగు అశోక్, మారగోని రమేష్, బొలుగురి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా కృష్ణ, ఉప్పలపల్లి నగేష్, జిట్టా శేఖర్, కునూరు శంకర్, చేపూరి శ్రీనివాస్, సుంచు సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు.






