సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు
14-07-2026 05:44 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు లో ఉన్న సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కలు తొలగించారు. మంగళవారం ఆ వార్డ్ కౌన్సిలర్ మేస పోసమ్మ సతీష్ ఆధ్వర్యంలో ఈ పిచ్చి మొక్కలు తొలగింపు కార్యక్రమం జరిగింది. కాలనీ ఆనుకుని ఉన్న ఈ కట్ట పై పిచ్చి మొక్కలు పేరుకుపోవడం రాకపోకులకు తీవ్ర అంతరాయంగా ఉండడంతో కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఈ తొలగింపును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆయనతోపాటు కాలనీవాసులు పలువురు ఉన్నారు.






