14 July, 2026 | 6:16 PM

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ

14-07-2026 05:39 PM

- చెక్కు పంపిణీ చేస్తున్న న్యాప్స్కాబ్ చెర్మన్ కొండూరు రవీందర్ రావు 

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. మండలానికి చెందిన రైతు దాసరి దేవరాజు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మృతి చెందగా, ఆయన కుటుంబానికి ఈ బీమా సాయం అందింది. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా మృతుడు దాసరి దేవరాజు భార్య దాసరి చంద్రకళకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు పేద కుటుంబాలకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతి అర్హుడూ ఇలాంటి పథకాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సురభి ప్రవీణ్ రావు, ఫీల్డ్ ఆఫీసర్ దుర్గం, సొసైటీ సీఈవో సందుపట్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.