14 July, 2026 | 6:29 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి

14-07-2026 05:50 PM

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని డిఏఓ మోహన్ రెడ్డి,ఏడిఏ సుధా మాధురి వీక్షించారు. వీడియో కాన్ఫిడెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏల్ నీనో ప్రభావం ఉన్నందున తెలంగాణ రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా నిర్దేశించారు.

ఆరుతడి పంటల్లో ముఖ్యంగా కంది, జొన్న, మినుములు, పెసర్లు, పొద్దుతేరుగుడు పువ్వు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ బోరు బావులలో వంగడాలను సాగు చేయవలసిందిగా కోరినట్లు స్థానిక ఏవో సాయికిరణ్ తెలిపారు. కావున మండలంలోని రైతులు ఆరుతాడి పంటలపై మొగ్గు చూపాలని ఏవో సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ మోహన్ రెడ్డి, ఏడిఏ సుధా మాధురి, ఏడిఏ టెక్నికల్ చంద్రజ్యోతి, మాల్తుమ్మెద సీట్ ఫామ్ ఏడిఏ ఇంద్రసేన్, ఏవో సాయికిరణ్, ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.