31 July, 2026 | 6:16 PM

సమస్యల పరిష్కారంకు కృషి: చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

31-07-2026 05:38 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారంకు ఎప్పటికప్పుడు కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో వర్షం కారణంగా వర్షపు నీరు నిలిచిపోయి ఇబ్బందులుపడుతుండడంతో చైర్మన్ బిరుదు కృష్ణ, కమిషనర్ టి.రమేష్,  కౌన్సిలర్లు జి.మంజుల రవి,  గాజుల రాజమల్లయ్య, వర ప్రదీప్, పద్మ అబ్బయ్య గౌడ్, కందునూరి సమత కుమార్లు  పరిశీలించడం జరిగింది. తక్షణమే వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు గాను  పైప్ లైన్ వేయించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు, అలాగే వార్డుల్లోనూ సమస్యల పరిష్కారంగా ఎప్పటికప్పుడు కృషి చేయడం జరుగుతుందని వారు  అన్నారు.