11 May, 2026 | 10:00 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!

11-05-2026 09:04 PM

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.!!

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇల్లు 83 మంది లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల సమక్షంలో మంజూరు పత్రాలను ఎమ్మెల్యే సునీత  లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు.

ప్రభుత్వ అధికారుల నిబంధన మేరకే ఇంటిని నిర్మించుకోవాలని లేనిపక్షంలో బిల్లులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, హౌసింగ్ డిఈ ప్రభు, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, శివంపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, స్థానిక శివంపేట సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.