31 July, 2026 | 6:31 PM

ఉపాధ్యాయుని దాతృత్వం

31-07-2026 05:46 PM

విద్యార్థి ప్రేమ్ కుమార్ ప్రతిభను గుర్తించి రూ.5,116 చెక్కు అందజేత

పాపన్నపేట: పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు మంగ నర్సింలు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మండల పరిధిలోని గాజులగూడెం పాఠశాలలో తల్లిదండ్రి లేని రెండవ తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ ప్రతిభను గుర్తించి రూ.5,116 చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరికి అందించారు. తన కూతురు సహస్త్ర పుట్టినరోజు పురస్కరించుకొని ఈ చెక్కును అందజేసినట్లు మంగ నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిసిరి, ఉపాధ్యాయులు రవీందర్, వేణుగోపాల్, వడ్ల సాయిలు పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.