గోరింటాకు చల్లదనంతో పాటు వేడిని తగ్గిస్తుంది
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): గోరింటాకు శరీరానికి చల్లదనంతో పాటు వేడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థినీలచే ప్రత్యక్షంగా గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఆషాడ మాసంలో మహిళలంతా సామూహికంగా ప్రత్యక్షంగా జరుపుకునే పండుగ అని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే అందమైన వేడుకని అన్నారు. గోరింటాకు వేడుకలను ప్రతి ఏటా నిర్వహించి మన వారసత్వ భావితరాలకు అందించే గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ వేడుకలో విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో విద్యార్థినీలతో పాటు ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.






