పెద్ది సుదర్శన్ ఆశయాల కోసం తుదికంటా పోరాడతాం
31-07-2026 05:35 PM
హుజుర్నగర్ నియోజకవర్గ బిఆరెస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్లలోని బిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయం లో పెద్ది సుదర్శన్ రెడ్డికి తెలంగాణ మళిదశ ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ పోరాట యోధులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనమైన నివాళి అర్పిస్తు మీ స్మృతులను మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం అని ,సుదర్శన్ రెడ్డి ఆశయాల కోసం తుదికంటా పోరాడతాంమన్నారు.






