1 June, 2026 | 1:42 PM

ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు

01-06-2026 12:20 PM

చిట్యాల, జూన్ 01(విజయక్రాంతి): చిట్యాల మండలం  ఉరుమడ్ల గ్రామం లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  జన్మదిన వేడుకలను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉరుమడ్ల గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 

కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి వేముల వీరేశం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్‌ను కట్ చేసి గ్రామ ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం వేముల వీరేశం కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, ఉరుమడ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉయ్యాల లింగయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పోలగొని నరసింహ గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి జనార్ధన్, వార్డు సభ్యులు పాకాల దినేష్, గంగాపురం రామ్ గౌడ్, మేడబోయిన స్వాతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.