4 March, 2026 | 10:57 PM

ఆలయ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

04-03-2026 09:08 PM

చిట్యాల,(విజయక్రాంతి): శ్రీ కనకదుర్గదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఆయన అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్మి సైదులు,మాజీ మున్సిపాల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, కాన్సిలర్స్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.