5 March, 2026 | 1:02 AM

ప్రజ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం

04-03-2026 09:25 PM

ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

కుమ్రంభీం ​ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని 17వ వార్డు జామా మస్జిద్ సమీపంలో గత కొన్ని రోజులుగా వాటర్ మోటర్ చెడిపోవడంతో కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం స్థానికులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. ప్రజా సమస్య పట్ల మానవత్వంతో వ్యవహరించిన ఆయన, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత ఖర్చులతో మోటార్‌కు మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.

​ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మాట్లాడుతూ  ప్రజా సేవయే పరమావధిగా పనిచేస్తామని, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందేలా చూడటం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ​తమ విన్నపంపై వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్‌కు కాలనీవాసులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గంధం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ నిసార్, షబ్బీర్, రాజుతో పాటు కాలనీవాసులు తాహెర్ హుస్సేన్, బాబా, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.