5 May, 2026 | 4:02 AM

‘పుష్ప’ నటుడు హీరోగా మటన్

05-05-2026 02:53 AM

పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి లీడ్ రోల్‌లో నటిస్తున్న మూవీ ‘మటన్‘. ‘రక్తం.. రణం.. ప్రతీకారం..’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు హర్షా డైస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సోమవారం విడుదల చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రా అండ్ రస్టిక్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. జగదీష్ ప్రతాప్ లుక్ ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్‌లో ‘ఆకలితో మొదలయ్యే ఆట, రక్తంతో ముగుస్తుంది..’ అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. మనస్వి, రాజేశ్ కన్నా, రమేశ్ మాదాసు, క్రాంతి సంజయ్, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి, తనాయ్ దేవునూరి, శ్రీనాథ్, నాగదీపక్ ముఖ్య తారాగణంగా ఉన్నారు.