4 March, 2026 | 10:55 PM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

04-03-2026 09:04 PM

ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణికి సిఐటియు జిల్లా నాయకులు చింతల యాదయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి  నార్కట్ పల్లి సబిత వినతిపత్రం అందజేశారు. కార్మికులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరచుగా బదిలీ చేయటం తక్షణమే నిలిపివేయాలన్నారు.

గ్రామపంచాయతీ కాలంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల ఏరియల్సును వెంటనే చెల్లించాలని, పోచారం మున్సిపాలిటీలో అమలు కానీ ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికులకు జిహెచ్ఎంసిలో జీతాలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికులకు పూర్తిగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ 58 సంవత్సరాలు పూర్తి చేసిన కార్మికులకు వారసత్వ ఉద్యోగము ఇవ్వాలన్నారు.

కార్మికులకు అవసరమైన పనిముట్లు రక్షణ కవచాలు, డ్రెస్సులు, నూనె, సబ్బులు తదితర అవసరమైన వస్తువులను క్రమం తప్పకుండా అందించాలని పేర్కొన్నారు. కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని లేని పక్షంలో ఒక పదిహేను రోజుల తర్వాత దీర్ఘకాలిక దీక్ష లో కూర్చోవడం జరుగుతుంది అని వారన్నారు నాపరిధిలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినట్లు, మన జోనల్ అధికారిణి కూడా కలిస్తే బాగుంటుందని సూచించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు.