కేరళంలో యూడీఎఫ్ జెండా
- మూడు స్థానాల్లో బీజేపీ విజయం
- యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా రేసులో రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, సతీశన్
కేరళంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) పరాజయం పాలైంది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఈ ఓటమికి కారణమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 71 స్థానాలను యూడీఎఫ్ సులభంగా అధిగమించింది. ఈ కూటమి ఏకంగా ౧౦౨ స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే 63 స్థానాల్లో విజయం సాధించడం విశేషం.
- వామపక్ష కోటను బద్దలుకొట్టిన యునైటెడ్ కూటమి
- మేజిక్ ఫిగర్ ౭౧ కాగా.. ఏకంగా ౧౦౨ స్థానాలు కైవసం
- కాంగ్రెస్ ఖాతాలో సొంతంగా ౬౩ స్థానాలు
- ఎల్‌డీఎఫ్ కూటమి కేవలం ౩౫ స్థానాలకు పరిమితం
- మూడు స్థానాల్లో బీజేపీ విజయం
- యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా సతీశన్?
త్రివేండ్రం, మే ౪:కేరళంలో వావపక్షాల శకం ముగిసింది. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కేరళంలో పదేళ్ల వామపక్ష కూటమి(ఎల్‌డీఫ్) కోటను బద్దలు కొట్టింది. అసెం బ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయా న్ని నమోదు చేసింది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 71 స్థానాలను యూడీఎఫ్ సులభంగా అధిగమించింది. ఈ కూటమి ఏకంగా ౧౦౨ స్థానాలను కైవసం చేసుకుంది.
ఫలితాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే 63 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. తద్వారా ఆ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీఎఫ్‌లో భాగస్వా మ్య పార్టీలైన ఇండియన్ యూ నియన్ ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్7 స్థానాలు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 3 స్థానాలు సాధించుకున్నాయి. అలాగే, కేరళ కాంగ్రెస్ జాకబ్, సీఎంపీకేఎస్‌సీ పార్టీలు చెరో స్థానా న్ని కైవసం చేసుకున్నాయి.
సీపీఎం ౨6 స్థానాలకే పరిమితం
అధికార ఎల్‌డీఎఫ్ ఫలితాల్లో వెనుకబడింది. కూటమి మొత్తంగా ౩౫ స్థానాలు మాత్రమే సాధించి గలిగింది. ప్రధాన భాగస్వామి సీపీఎం కేవలం 26 స్థానాలకే పరి మితమైంది. మరో మిత్రపక్షం సీపీఐ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రీ య జనతా దళ్, ఆర్‌ఎంపొయ్ పార్టీలు చెరో ఒక సీటును గెలుచుకున్నాయి. అలాగే, బీజే పీ గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు స్థానాలను దక్కించుకోవడం విశేషం.
యూడీఎఫ్ సీఎం అభ్యర్థి సతీశన్?
యూడీఎఫ్ కూటమి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న తలెత్తింంది. కాంగ్రెస్ నుంచి వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయన మొన్నటివరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో సమర్థంగా పనిచేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అలాగే, పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఈయన గతంలో హోం మంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ముఖ్యమంత్రి రేసులో పేరు వినిపిస్తున్నది. అయితే.. ముగ్గురిలో సతీశన్ వైపే పార్టీ మొగ్గు చూపుతన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో
కేరళం అసెంబ్లీకి గత ఎన్నికలు 2021 మే నెలలో జరిగాయి. మొత్తం 140 అసెంబ్లీ ని యోజకవర్గాల్లో ఎల్‌డీఎఫ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ కూటమి మొత్తం 99 సీట్లను దక్కించుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి 41 స్థానాలకే పరిమితమైంది.







