21 March, 2026 | 5:53 PM

మతసామరస్యానికి ప్రతీక రంజాన్

21-03-2026 03:49 PM

అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్, మార్చి 21 (విజయక్రాంతి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ ఈద్గా వద్ద మైనారిటీ సోదరులను కలుసుకుని షాద్ నగర్ ఎమ్మెల్యే వీరేపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రంజాన్ పండుగ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతి కానీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.

పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుందనీ, ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను అని వివరించారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ.. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస వేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మైనారిటీ సోదరులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు..