25 March, 2026 | 12:27 AM

టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బాధ్యతల స్వీకారం

24-03-2026 12:00 AM

షాద్ నగర్, మార్చి 23(విజయక్రాంతి): షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం గాంధీ భవన్లో టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో హా జరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ రావత్ తదితరులు శంకర్కు శుభాకాంక్షలు తెలిపారు.

33 జిల్లాల్లో బలహీన వర్గాలను సం ఘటితం చేయాలని, వారి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కుల సర్వే ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని నేతలు పేర్కొన్నారు.భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కు మార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, సీ నియర్ నేతలు వి. హనుమంతరావు, మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.