25 March, 2026 | 2:08 AM

పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు

24-03-2026 12:00 AM

అలంపూర్,మార్చి 23: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న ఓ విద్యార్థికి పుట్టెడు దుఃఖ మిగిలింది. విద్యార్థి తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. మరో పక్క కొడుకు పదవ తరగతి పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంది. ఈ హృదయ విధాకర సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

అమరవాయి గ్రామానికి చెందిన కరీం (40) అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే తండ్రి మృతదేహం అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో కొడుకు సమీర్ పదవ తరగతి పరీక్ష రాసేందుకు మానవపాడు పరీక్ష కేంద్రానికి వెళ్ళాడు. ఒకవైపు కన్నతండ్రిని కోల్పోయి పుట్ట దుఃఖంతో మరోవైపు భవిష్యత్తును నిర్వహించే పరీక్షకు కన్నీళ్లు కారుస్తూ గుండె నిబ్బరంతో సమీర్ పరీక్షకు హాజరైన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.