calender_icon.png 21 February, 2026 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే వెడ్మ

21-02-2026 02:19:35 AM

ఉట్నూర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కాస్త ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా ప్రమాణాలను తెలుసుకోన్నారు. ఉట్నూర్ మండలం కన్నాపూర్ గ్రామ పంచాయతీ పాఠశాలను ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం ఆకస్మిక తనికి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే బ్లాక్‌బోర్డుపై లెక్కలు నేర్పిం చారు. అనంతరం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతం గా పర్యటించారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ మండలం గంగాపూర్ లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం ను ప్రారంభించారు. అనంతరం గంగాపూర్ లో గ్రామ సమైక్య భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి కన్నాపూర్ లో గ్రామ సమాఖ్య భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్, ముత్నూర్ గ్రామాల్లో గ్రామ సమస్య భవనాలకు  శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని  తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పి.ఆర్ డిప్యూటీ ఈ.ఈ పవర్ రమేష్, ఏపీడి వసంతరావు జాదవ్, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల పటేల్‌లు, పొదుపు సంఘాల మహిళలు, ఐకెపి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.