23 August, 2026 | 2:12 AM

ఈహెచ్‌ఎస్ సేవలకు హాస్పిటల్స్ అంగీకారం

23-08-2026 01:17 AM

హర్షం వ్యక్తం చేసిన ఎస్టీయూటీఎస్ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 22 (విజ యక్రాంతి): నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి తెచ్చేలా- అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అం గీకారం తెలపడం పట్ల ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానం దం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

శనివారం తెలంగాణ సచివాలయం లో ఎంపానెల్ ఆసుపత్రుల ప్రతిని ధులతో హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్వహిం చిన సమన్వయ సమావేశంలో ఈహెచ్‌ఎస్ లబ్ధిదారులకు వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేం దుకు ఆసుపత్రుల ప్రతిని ధులు ఏకాభిప్రాయం వ్య క్తం చేసినట్లు తెలిపారు. దీంతో అర్హులైన ఉద్యోగు లు, ఉపాధ్యాయులు, పిం ఛనుదారులు, వారి ఆధా రితులకు నగదు రహిత వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయన్నారు.