18 June, 2026 | 5:10 AM

బేగంపేటలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

18-06-2026 12:00 AM

కూకట్‌పల్లి, జూన్ 17 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధి బేగంపేట డివిజన్ లో అధికారులతో బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు బేగంపేటలోని హిందూ స్మశాన వాటికను పరిశీలించారు. స్మశాన వాటికలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన స్మశాన వాటికను ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నారని, కనీసము మొక్కలకు నీళ్లు కూడా పోయట్లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసి  అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రకాష్ నగర్ ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్ లో అసోసియేషన్ సభ్యులు, అధికారులతో కలిసి రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. స్వీకరించారు కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలపై అందించిన వినతి పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేగంపేట డివిజన్ ను మల్కాజిగిరి సర్కిల్లో కలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై న్యాయపరంగా ఎదుర్కొని ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎస్ ఐ ఆర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బి ఎల్ ఓ లు అడిగిన తగిన గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.

పింఛన్ లు రాని  అర్హులైన నిరుపేదలకు కొత్త పింఛన్ లు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, వాటర్ వరక్స్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ అధికారులు, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు  సురేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేష్, మాజీ డివిజన్ అధ్యక్షులు రాజయ్య, స్థానిక నాయకులు రఘునాథ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.