21 August, 2026 | 12:33 AM

ఎంజీ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

21-08-2026 12:01 AM

మణికొండ, ఆగస్టు 20, (విజయ క్రాంతి): నెక్నాంపూర్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజల సమిష్టి కృషితో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. గురువారం నెక్నాంపూర్ డివిజన్లో ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న ఎంజీ పార్కును స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. దీంతో పార్కు వాకర్స్, చిన్నారులు, కాలనీవాసుల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది.

డివిజన్ పరిధిలోని అన్ని పార్కుల్లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, ఇప్పటికే ఆమోదం పొందిన రోడ్డు అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని డివిజన్ అధ్యక్షుడు జితేందర్ కోరగా, ఎమ్మెల్యేతో పాటు అధికారులు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ యలాల నరేష్, మార్కెట్ డైరెక్టర్లు బాల్ రెడ్డి, లక్ష్మీ శ్రీ, నాయకులు నీలేష్, ఏరోళ్ల రాజు, రవికాంత్, నరేందర్, శ్రీరాములు, బషీర్, సావిత్రి, ప్రభావతి, శివగంగ, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.