తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
27-08-2026 08:36 PM
కోదాడ,(విజయక్రాంతి): మండలంలోని మంగలి తండా గ్రామంలో గురువారం తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన తీజ్ బుట్టను గిరిజన వేషధారణలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తలపై పెట్టుకొని వేడుకలో పాల్గొని, తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపి గ్రామ ప్రజలతో గిరిజన సంప్రదాయంలో నృత్యం చేసి అందర్నీ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ బాబ్జి నాయక్. ఉప సర్పంచ్ ధరావత్ కృష్ణవేణి హనుమంతు. వార్డు సభ్యులు బానోత్ శారద వెంకటేశ్వర్లు. ధరావత్ జయ జండా. ధరావత్ రాజు. మాలోత్ వెంకటేశ్వర్లు. ధరావత్ సాలమ్మ లచ్చు. ధరావత్ కమలా కీమా. ధరావత్ నెహ్రూ పాల్గొన్నారు.






