13 June, 2026 | 3:01 AM

సత్తుపల్లి నియోజకవర్గ సీఎంఆర్‌ఎఫ్ పెండింగ్ ఫైళ్లపై ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రత్యేక దృష్టి

13-06-2026 01:20 AM

సత్తుపల్లి, జూన్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్‌ఎఫ్ పెండింగ్ ఫైళ్లు మరియు రీ-వాలిడేషన్ ఫైళ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సహాయం త్వరితగతిన అందేలా పెండింగ్లో ఉన్న ఫైళ్ల పురోగతిని సమీక్షించి, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సీఎంఆర్‌ఎఫ్. చెక్కులు అందే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.